భారతదేశం, డిసెంబర్ 10 -- మాస్ మహారాజ రవితేజ ఈసారి సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ మధ్యే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. బుధవారం (డిసెంబర్ 10) అద్దం ముందు నిలబడి అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోని లీడ్ రోల్స్ రవితేజ, డింపుల్ హయతి మధ్య సాగే రొమాంటిక్ మెలోడీ అద్దం ముందు నిలబడి వచ్చేసింది. యూరప్ లోని అదిరిపోయే లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ లిరికల్ వీడియోలో షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఇందులో రవితేజ, డింపుల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి.

ఈ పాటను చంద్రబోస్ రాయగా.. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అంది...