భారతదేశం, జనవరి 19 -- రథసప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతి ఏటా రథసప్తమి మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాము. సూర్యుడు రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చి, ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని, ఆ పర్వదినాన సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయని నమ్మకం.

ఈ ఏడాది రథ సప్తమి జనవరి 25న వచ్చింది. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణాన్ని మొద...