భారతదేశం, సెప్టెంబర్ 30 -- వరుసగా యాక్షన్ సినిమాలతో, ఎలివేషన్ మూవీస్ తో సాగిపోతున్నాడు ప్రభాస్. ఒకప్పుడు బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ అంటూ కామెడీ టైమింగ్ తో, స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టాడు ప్రభాస్. కానీ ఇటీవల ఆయన నుంచి ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి వింటేజీ లుక్ కానీ రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు 'ది రాజాసాబ్' వచ్చేస్తోంది.

ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. వింటేజీ లుక్ మాత్రమే కాదు, అప్పటి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొడుతున్నాడు డార్లింగ్. రీసెంట్ గా రిలీజైన రాజా సాబ్ ట్రైలర్ తో ఇది మరోసారి స్పష్టమైంది. ఇందులో ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ చలాకీగా, కామెడీ టైమింగ్ తో కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. రాజాసాబ్ మూవీతో ప్రభాస్ మళ...