భారతదేశం, నవంబర్ 5 -- ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు మళ్లీ చేతులు కలిపారు. అయితే ఇద్దరూ తెరపైన కలిసి కనిపించడం లేదు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రజనీకాంత్ లీడ్ రోల్లో నటించబోతున్నాడు. తలైవా 173 మూవీ అనౌన్స్‌మెంట్ బుధవారం (నవంబర్ 5) జరిగింది. కమల్ ఏం ట్వీట్ చేశాడో చూడండి.

ఓ సూపర్ స్టార్ హీరోగా, మరో సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. స్క్రీన్ పై రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరూ చేతులు కలిపినా.. ఒకరు హీరో, మరొకరు ప్రొడ్యూసర్ అని మాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని కమల్ హాసన్ బుధవారం (నవంబర్ 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా 2027 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.

"గాలిలా, వర్షంలా...