భారతదేశం, ఆగస్టు 10 -- తలైవా సినిమా వస్తుందంటే కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. ఇప్పుడు కూలీ సినిమా రిలీజ్ కు ముందు ఆ వైబ్ గ్రాండ్ గా కనిపిస్తోంది. ఆగస్టు 14న రజనీకాంత్ సినిమా 'కూలీ' (Coolie) రిలీజ్ కానుంది. సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో కూలీ సినిమా కొత్త రికార్డులు నెలకొల్పుతుంది. గతంలో ఏ మూవీకి సాధ్యం కాని ఘనతలను సొంతం చేసుకుంటుంది.

కూలీ మేనియా మామూలుగా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన కూలీ గోలనే. రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ తదితర స్టార్లు నటిస్తుండటంతో ఈ మూవీకి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ ఫస్ట్ సినిమా కావడంతో హైప్ మరింత పెరిగింది. అందుకు తగ్గట్లుగాన...