భారతదేశం, ఆగస్టు 5 -- అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన పవిత్ర పండుగ రక్షా బంధన్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండుగ తేదీ, పూజకు సరైన సమయం వివరాలు ఇలా ఉన్నాయి.

సనాతన ధర్మం ప్రకారం శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 09:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అనగా ఆగస్టు 28, 2026 శుక్రవారం ఉదయం 09:48 గంటలకు ముగుస్తుంది.

ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి ఈసారి ఆగస్టు 28న రక్షా బంధన్‌ను జ...