Hyderabad, ఆగస్టు 8 -- ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. అదే రోజున బుధుడు కర్కాటక రాశిలో ఉదయించనున్నాడు. పైగా ఆ రోజు శ్రవణ, ధనిష్ట నక్షత్రాల కలయిక జరగబోతోంది. సిద్ధి యోగం కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో అదే రోజు బుధుడు ఉదయించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటారు.

మీడియా, విద్య, మార్కెట్ రంగాల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. మరి ఏ రాశుల వారు బుధుని ఉదయంతో శుభ ఫలితాలను పొందుతారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి బుధుని ఉదయం శుభ ఫలితాలను అందిస్తుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు ప్రేమ, అందానికి కారకుడు. శుక్రుడు, బుధుడు రెండూ కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటాయి. బుధుని ఉదయంతో ఈ రాశి వారు సంతోషం...