Hyderabad, ఆగస్టు 7 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి కూడా మారుతూ ఉంటాయి. ఈసారి ఆగస్టు 9న రక్షాబంధన్ వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను జరుపుకుంటాము. అక్క చెల్లెలు, అన్నదమ్ములకు రాఖీ కట్టి ఎంతో ప్రేమగా రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.

తన సోదరుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా సోదరుడు తన సోదరిని రక్షిస్తానని మాట ఇస్తాడు. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రక్షాబంధన్ చాలా శుభప్రదమైన రోజు.

గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉంది. రక్షాబంధన్ నాడు చంద్రుడు సంచారంలో కూడా మార్పు ఉంటుంది. రక్షాబంధన్ రోజున శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెడతాడు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

చంద్రుడు శ్రవణ నక్ష...