భారతదేశం, జూలై 8 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులు కూడా చాలా విశేషమైనవి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే, సంవత్సరంలో 24 సార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాము. ఈ ఏడాది జూలై 10న, అంటే ఎల్లుండి, యోగినీ ఏకాదశి రాబోతోంది. ఈ విశేష పర్వదినాన శ్రీహరిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్రీహరి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అయితే, యోగినీ ఏకాదశి నాడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వీటిని పాటించడం వల్ల అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సిరిసంపదలకు లోటు ఉండదు.

యోగినీ ఏకాదశికి ముందు ఈ వాస్తు నియమాలను పాటించండి. యోగినీ ఏకాదశికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. జూలై 10న రానున్న ఈ పవిత్ర దినాన విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. పాపాలు తొలగిపోతాయ...