భారతదేశం, జూలై 15 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్​ఈ) మెయిన్స్ 2025 పరీక్షల టైమ్‌టేబుల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2025 ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. పూర్తి వివరాలు..

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష 2025ని ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సీఎస్​ఈ పరీక్షా విధానం మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 200 మార్కులకు, రెండూ ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి. పేపర్ II (సీశాట్​) కేవలం అర్హత స్వభావం కలిగినది, అభ్యర్థులు కనీసం 33% మార్కులు సాధించాలి. రెండు పేపర్లు ఇంగ్...