భారతదేశం, డిసెంబర్ 30 -- బండ్ల గణేష్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు ఓ సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా. ప్రొడ్యూసర్ గా గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ లాంటి సినిమాలు నిర్మించాడు బండ్ల గణేష్. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న అతను ఇప్పుడు మళ్లీ ప్రొడ్యూసర్ గా కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. కొత్త బ్యానర్ ను అనౌన్స్ చేశాడు.

నిర్మాత బండ్ల గణేష్ కొత్త బ్యానర్ ను ప్రకటించాడు. ఇవాళ (డిసెంబర్ 30) బండ్ల గణేస్ బ్లాక్ బస్టర్స్ (బీజీ బ్లాక్ బస్టర్స్) బ్యానర్ ను అనౌన్స్ చేశాడు. తన సెకండ్ బ్యానర్ ను లాంఛ్ చేశాడు. బండ్ల గణేష్ ఇప్పటికే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ బిజీ కానున్నాడు. ''నా సెకండ్ బ్యానర్ బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ (బీజీ బ్లాక్ బస్టర్స్)ను ఎంతో గర...