భారతదేశం, నవంబర్ 9 -- మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ (సిస్టెమ్యాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) చేయండి, సిప్​ చేయండి అని అందరు చెబుతూనే ఉంటున్నారు! అంతా బాగానే ఉంది కానీ.. మరి మ్యూచువల్​ ఫండ్​లో సిప్​ చేయడం ఎప్పుడు ఆపేయాలి? సిప్​ని డిస్కంటిన్యూ చేయడం అనేది ఎలాంటి సందర్భాల్లో ఉత్తతమమైన నిర్ణయం అవుతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా, ఆర్థిక సలహాదారులు.. వీలైనంత వరకు సిప్​లను నిలిపివేయవద్దని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు. మార్కెట్లు పడిపోతున్నప్పుడు కూడా, "రూపీ కాస్ట్ యావరేజింగ్" కారణంగా, తక్కువ ధరకు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి అదే సరైన సమయం అని చెబుతుంటారు.

కొన్నిసార్లు, వ్యాపారంలో నష్టాలు వచ్చినా సరే, ఈ కష్ట సమయాల్లో సిప్​ ఆపవద్దని సలహా ఇస్తారు. మరో కారణం ఏమిటంటే, కాంపౌండింగ్ ప్రయోజనం పూర్తి స్థాయిలో లభ...