భారతదేశం, జూన్ 14 -- ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న ఆయుధం 'ఇన్వెస్ట్​మెంట్​'! ఈ విషయాన్ని గ్రహించిన అనేక మంది భారతీయులు ఇటీవలి కాలంలో తమ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించారు. ఈ ఇన్వెస్ట్​మెంట్స్​లో చాలా వరకు స్టాక్​ మార్కెట్​లోకి వెళుతున్నాయి. అయితే, షేర్ మార్కెట్ అస్థిరతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. సిప్​ ద్వారా చేసే పెట్టుబడి 'రూపాయి వ్యయ సగటు' (రూపీ కాస్ట్​ యావరేజింగ్​) ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఒక ఆస్తిని, అంటే స్టాక్స్‌ను, కొనుగోలు చేసే ఖర్చును సగటున తగ్గించుకోవడానికి సమర్థవంతమైన మార్గం.

ఉదాహరణకు, ఒక సెక్యూరిటీ రెండు నెలల కాలంలో రూ. 200 నుంచి రూ. 250 మధ్య ఐదు వేర్వేరు ధరల వద్ద అందుబాటులో ఉన్నప్పుడు.. అధిక ధర...