భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ 'లోకా: చాప్టర్ 1 - చంద్ర' హిస్టరీ క్రియేట్ చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా నటించిన ఈ సినిమా కొత్త చరిత్ర నమోదు చేసింది. అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు అందుకుంది. మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఎల్2 ఎంపురాన్ సినిమా రికార్డును లోకా బ్రేక్ చేసింది.

డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన సూపర్ హీరో సినిమా 'లోకః చాప్టర్ 1 - చంద్ర' ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. కల్యాణి ప్రియదర్శన్, నాస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ప్రిథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన 'ఎల్2 ఎంపురాన్' ను ఓడించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ రికార్డును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ లోక...