భారతదేశం, డిసెంబర్ 16 -- లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే దిలీప్ కొత్త సినిమా 'భ భ బ' (Bha Bha Ba) ప్రమోషన్లలో స్టార్ హీరో మోహన్‌లాల్ భాగస్వామ్యం కావడంపై ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి మద్దతు ఇవ్వాల్సిన పెద్దలే ఇలా చేయడం "బాధ్యతారాహిత్యం" అని ఆమె మండిపడింది.

కేరళలో సంచలనం సృష్టించిన నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో డిసెంబర్ 8న కోర్టు నటుడు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే దిలీప్ నటిస్తున్న 'భ భ బ' (భయం భక్తి బహుమానం) సినిమా ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

అయితే తీర్పు వచ్చిన వెంటనే మోహన్‌లాల్ ఈ సినిమా పోస్టర్లను, ప్రమోష...