భారతదేశం, ఆగస్టు 5 -- 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15, 2025తో ముగుస్తుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను (ఐ-టీ) శాఖ ITR-1, ITR-2, ITR-3 ఆన్‌లైన్ ఫైలింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. మీరు మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

1. నిపుణుల సలహా తీసుకోండి: మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేసేవారు ఒక నిపుణుడి సలహాను తీసుకోవడం మంచిది. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా ఆదాయపు పన్ను నిపుణుడి సహాయం తీసుకోవచ్చు. మీకు ఒకే ఒక్క ఆదాయ వనరు ఉంటే సొంతంగా ఫైల్ చేసుకోవడం సులభమే. కానీ మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉండి, అనేక మినహాయింపులను (డిడక్షన్స్​) క్లెయిమ్ చేయాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.

2. ఐ-టీ పోర్ట...