భారతదేశం, ఆగస్టు 7 -- దాదాపు పదేళ్ల క్రితం, తెలంగాణలోని లంబాడిపల్లి ప్రజలు తమ జీవితంలోని కొన్ని విషయాలను యూట్యూబ్ ఛానెల్ మై విలేజ్ షోలో పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారి ప్రపంచం మారబోతోందని వారికి తెలియదు. భారీ వ్యూస్, సెలబ్రిటీలు, అభిమానుల నుండి ప్రేమ వాళ్లకు దక్కింది. ఇప్పుడు వాళ్లలో ఒకరు అనిల్ జీల హీరోగా మారాడు. జీ5 వెబ్ సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ' లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సిరీస్ ఆగస్టు 8న ఓటీటీలోకి రాబోతుంది.

మోతెవరి లవ్ స్టోరీకి బుర్రా శివ కృష్ణ దర్శకత్వం వహించాడు. అతను కూడా మై విలేస్ షో నుంచి వచ్చినవాడే. హిందుస్థాన్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో అనిల్ జీల.. ''తెరపై కనిపించాలని కలలు కనే ముందు నుంచే నటనపై ఆసక్తి మొదలైంది. యూట్యూబ్‌లో నటించినప్పుడల్లా నాలో ఏదో ఒక స్పార్క్ వచ్చేది. త్వరలోనే పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రల కోసం ...