భారతదేశం, మే 4 -- మే నుంచి డిసెంబర్ 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2026 ద్వితీయార్థం (మే నుంచి డిసెంబర్ వరకు) అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కానుంది. ఈ కాలంలో కర్మఫల ప్రదాత అయిన శని దేవుడు మీన రాశిలో సంచరించనుండగా, సూర్యుడు, కుజుడు కూడా తమ ప్రభావంతో రాశి చక్రాలను ప్రభావితం చేయనున్నారు.

ఈ మూడు ప్రధాన గ్రహాల కలయిక వల్ల పలు రాశుల వారికి ఆగిపోయిన పనులు వేగవంతం కావడమే కాకుండా, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఈ ఎనిమిది నెలల కాలం గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు.

వృషభ రాశి జాతకులకు మే నుంచి డిసెంబర్ వరకు సమయం ఎంతో ప్రశాంతంగా గడవనుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి.

వృత్తి: ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు...