భారతదేశం, డిసెంబర్ 22 -- 2026 సంవత్సరంలో గ్రహాల స్థానం ఆధారంగా, సంవత్సరం ఫలితాన్ని చెప్పవచ్చు. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు ధనుస్సులో బుధుడు, శుక్రుడు, కుజ గ్రహంతో ఉంటాడు. గురువు మిథున రాశిలో ఉంటాడు. శని మీన రాశిలో ఉంటాడు. సింహ రాశిలో కేతువు ఉంటాడు. కుంభ రాశిలో రాహువు ఉంటాడు. ఇవన్నీ సంవత్సరపు ఫలాలను ప్రదాతలుగా ఉంటాయి.

ప్రస్తుతం మేష రాశి వారిపై ఏలినాటి శని కూడా నడుస్తోంది. అటువంటి పరిస్థితిలో మేష రాశి ప్రజల కెరీర్, వ్యాపారం, ప్రేమ జీవితం మరియు ఆరోగ్యంపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. మరి ఇక ఈ కొత్త ఏడాది మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

2026 మేష రాశి వారికి బాగుంటుంది. అన్ని కలగలిపి ఉంటాయి. అయితే కొంచెం కొత్త సంవత్సరం అంత మెరుగైన ఫలితాలను చూడకపోవచ్చు. కెరీర్ పరంగా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆదాయం పరంగా బాగుంటుంది. వాహనాలు, ఇల...