భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వెలసిన మేడారం సమ్మక్క-సారలమ్మల వనదేవతలను 'ది ప్యారడైజ్' చిత్రబృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా కథానాయకుడు నాచురల్ స్టార్ నాని, నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు చిత్ర బృంద సభ్యులు మేడారానికి చేరుకోగా, ఆలయ అధికారులూ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

అనంతరం నాని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు నానికి, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వనదేవతలకు ఎత్తు బంగారం ఇచ్చారు. అభిమాన నటుడు నాని తమ గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు.

సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన 'ది ప్యారడైజ్' సినిమా ...