భారతదేశం, జనవరి 29 -- మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే సారలమ్మ గద్దెపైకి రాగా. ఇవాళ సమ్మక్క కొలువుదీరనుంది. సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటున్న వేళ.. భక్తులు భారీగా తరలివస్తున్నారు.

చిలకలగట్టు కంకవనం నుంచి జనంలోకి సమ్మక్క తల్లి ఆగమనం చేసింది. శుభసుచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....