భారతదేశం, జనవరి 27 -- బాలీవుడ్ హీరో వరున్ ధావన్ తన లేటెస్ట్ మూవీ బోర్డర్ 2 విజయంతో మంచి జోష్ మీదున్నాడు. కానీ అతని ఉత్సాహానికి ఎండ్ కార్డు వేస్తూ ముంబై మెట్రో సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. మెట్రో ట్రైన్ లో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించింది. రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ చేయడమే ఇందుకు కారణం.

వరుణ్ ధావన్ ముంబై ట్రాఫిక్‌ను తప్పించుకుని, అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సినిమా హాల్‌కు మెట్రోలో ప్రయాణించాలని అనుకున్నాడు. ధావన్ ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పర్యటనను టీజ్ చేశాడు. మెట్రో లోపలి నుండి ఒక స్టోరీని పోస్ట్ చేసి, ఏ థియేటర్‌కు వెళ్తున్నాడో ఊహించమని అడిగాడు. వెంటనే అతను రైల్లో పైనున్న మెటల్ రాడ్‌కు వేలాడుతూ తోటి ప్రయాణికులు సమీపంలో నిలబడి ఉండగా పుల్-అప్స్ చేశాడు.

మెట్రో రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై ముంబ...