భారతదేశం, ఆగస్టు 10 -- మెగా ఫ్యామిలీలోని హీరోల సంఖ్య ఎక్కువే. చిరంజీవి నుంచి మొదలెడితే వైష్ణవ్ తేజ్ వరకూ అందరూ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఈ మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ హీరోలు ఒక్క చోట చేరితే ఉండే సందడే వేరు. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే ఫొటోకు పోజు ఇస్తే.. ఇంకేముంటుంది? పిక్ వైరల్ కాకుండా ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతోంది.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి సోదరి కొడుకు సాయి దుర్గా తేజ్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. జిమ్ లో కసరత్తులు చేసిన తర్వాత ఈ ఫొటో తీసుకున్నట్లు తెలుస్తోంది. మిర్రర్ లో వరుణ్ తేజ్ ఫొటో తీస్తుండగా.. వెనకాల ఇంటెన్సివ్ గా చూస్తూ రామ్ చరణ్, ఆ వెనకాల మీసం తిప్పుతూ సాయి దుర్గా తేజ్ కనిపించారు.

వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్ ...