భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగుతున్న వేళ.. తన ప్రాణం పోతుందని తెలిసినా.. కన్నప్రేమతో ఓ తల్లి తన కొడుకును కిటికీలోంచి బయటకు నెట్టింది, సురక్షితంగా కాపాడుకుంది. తాను మాత్రం మంటల్లో చిక్కుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి సమీపంలో రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఒక టిప్పర్ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది మరణించారు. ఈ ఢీకొన్న ప్రభావంతో చెలరేగిన భారీ మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కనిగిరికి చెందిన 45 ఏళ్ల ఉప్పు రమాదేవి కూడా ఉన్నారు. ఆమె తన కుమారుడు మనోహర్‌తో కలిసి జగిత్య...