భారతదేశం, మే 4 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఐశ్వర్యం, ప్రేమ, సౌఖ్యాన్ని ప్రసాదించే శుక్ర గ్రహం తన నడకను మార్చిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో కొలువై ఉన్న శుక్రుడు, త్వరలోనే మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

హిందూ పంచాంగం ప్రకారం, 2026 మే 8వ తేదీ శుక్రవారం రాత్రి 09:51 గంటలకు శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి కుజుడు (మంగళుడు) అధిపతి. అంటే శుక్ర, మంగళ గ్రహాల శక్తులు మేళవించే ఈ సమయం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మే 19 వరకు శుక్రుడు ఇదే స్థితిలో కొనసాగుతాడు. ఈ 11 రోజుల కాలం ఏయే రాశుల జాతకాలను మలుపు తిప్పబోతుందో ఇప్పుడు చూద్దాం.

సింహ ...