భారతదేశం, మార్చి 1 -- మూసీ బాధితులకు మా పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.మూసీ బాధిత కుటుంబాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలతో మూసీ దండి మార్చ్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మూడున్నర కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం రియల్ ఎస్టేట్ దందా చేయడం మాత్రమేనని దుయ్యబట్టారు. దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ...