భారతదేశం, మార్చి 28 -- మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణానికి డిజైన్‌ను మూసీ రివర్‌ఫ్రంట్‌ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన 3D నమూనా కూడా విడుదలైంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన అత్యవసరమన్నారు. హైదరాబాద్‌ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తోందని.. నల్గొండ వరకూ వెళ్తోందని చెప్పారు. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన ఊరి నుంచి పిల్ల...