Hyderabad, ఆగస్టు 25 -- బిగ్ బాస్ షో మొదలవుతుందంటే చాలు.. ఎవరెవరు హౌస్ లోకి వస్తారు? వాళ్లు ఎంత తీసుకుంటున్నారు అనే చర్చ మొదలవుతుంది. ఆదివారం (ఆగస్టు 24) నుంచి బిగ్ బాస్ 19 మొదలైన వేళ ఇప్పటి వరకూ ఈ షో చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరో మీకు తెలుసా? ఆమె కెనడియన్, అమెరికన్ యాక్టర్, మోడల్ అయిన పమేలా అండర్సన్.

పమేలా బిగ్ బాస్ సీజన్ 4 లోకి రావడం అనేది ప్యూర్ స్ట్రాటెజీ. బాలీవుడ్ రియాలిటీ స్పేస్ లోకి హాలీవుడ్ గ్లామర్ ని తీసుకురావడం ఇది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన మొట్టమొదటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఆమె. ఆమె ఎంట్రీ నిజంగా ఒక సెన్సేషన్ అయ్యింది. ముంబైకి చేరుకున్నప్పుడు ఎయిర్ పోర్టులోనే ఆమెని జనం చుట్టుముట్టారు. ఆమె ఒక తెల్ల చీర కట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ తో స్టేజ్ మీద డాన్స్ కూడా చేశారు. మరి దీనికోసం ప...