భారతదేశం, డిసెంబర్ 30 -- ఓటీటీలోకి ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ డైరెక్టర్ మారుతి నిర్మించిన సినిమా ఇది. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న ఆ తెలుగు చిత్రమే 'బ్యూటీ'. ఈ సినిమాకు 8.8 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందో ఓ లుక్కేయండి.

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ బ్యూటీ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ కొత్త సినిమా జనవరి 2న డిజిటల్ డెబ్యూ చేయనుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్ వీకే, వాసుకీ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఆర్వీ సుబ్రహ్మణ్యం డైరెక్టర్.

రాజాసాబ్ సినిమాతో థియేటర్లను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు...