భారతదేశం, డిసెంబర్ 27 -- శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్స్ తో దండోరా సినిమాకు చాలా వరకు నెగటివ్ పబ్లిసిటీ వచ్చిన విషయం తెలుసు కదా. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లపై అతడు నోరు జారాడు. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మురళీకాంత్ ఆ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రెండు, మూడు మాటలు దొర్లాయని, వాటిని పట్టుకొని సినిమాను జడ్జ్ చేయొద్దని కోరాడు.

దండోరా సినిమా డైరెక్టర్ మురళీకాంత్ తమ సినిమాను ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి చూడాలని కోరాడు. శుక్రవారం (డిసెంబర్ 26) జరిగిన సక్సెస్ మీట్ లో అతనితోపాటు టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ..

"మీకు సినిమా చూసిన తర్వాత నచ్చితే పది మందికి చెప్పండి. రండి థియేటర్ కు వచ్చి చూడండి. ఈ సినిమాలో పవర్ హౌజ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. రవికృష్ణ, మణిక, నందు, బిందు మాధవి, నవదీప్, శివాజీ.. ఇలా ...