భారతదేశం, ఆగస్టు 9 -- ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె చేస్తున్న లేటెస్ట్ ఫీమేల్ లీడ్ మూవీ 'పరదా' (Paradha). ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ (ఆగస్టు 9) రిలీజ్ చేశారు. హీరో రామ్ పోతినేని చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. శనివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న 'పరదా' సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ గ్రామంలోని మహిళలకు పరదా కప్పుకోవడం ఆచారం. ఆ ఆచారాన్ని ఎవరు పాటించకపోయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ గ్రామంలో పరదాతోనే అమ్మవారు కొలువై ఉండటం విశేషం.

ఆ గ్రామానికి చెందిన అనుపమ పరమేశ్వరన్ ఊరి దాటి బయటకు వెళ్లాల్సి వచ్చినా.. పరదా వేసుకుంటూనే ఉంటుంది. మరి ఆమె పరదా తీయాల్సిన పరిస్థితి ఏమైంది? ఊర్లో ఏం జరి...