భారతదేశం, అక్టోబర్ 31 -- తమిళ కామెడీ మూవీ కిస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొత్తానికి సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఓ బుక్కు చదివి వింత శక్తిని పొందే ఓ యువకుడి చుట్టూ తిరిగే మూవీ ఇది. స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ మూవీ కిస్ (Kiss). ప్రముఖ నటుడు కవిన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.

మూవీ ట్రైలర్ పోస్ట్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని తెలిపింది. "అందరికీ ఓ కిస్ పార్సిల్.. కవిన్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ మూవీ కిస్ ను జీ5లో నవంబర్ 7 నుంచి చూడండి" అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.1 రేటింగ్ నమోదైంది.

తమిళ ర...