భారతదేశం, నవంబర్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో రత్న శాస్త్రం కూడా చాలా ముఖ్యమైనది. చాలా మంది రకరకాల రత్నాలను ధరిస్తారు. అలాగే కొందరు ముత్యాలను కూడా ధరిస్తారు. ముత్యం చంద్రుని యొక్క ఒక రకమైన ప్రతిరూపం. ఇది చంద్రుని లక్షణాలను కలిగి ఉంటుంది. ముత్యం అనేది తెలుపు రంగు ప్రకాశంతో నిండిన చల్లని ప్రభావంతో కూడిన సున్నితమైన ప్రకృతి రత్నం. జ్యోతిష్య దృష్టిలో, చంద్రుడు బలపడటానికి చాలా మంది ముత్యాలను ధరిస్తారు. జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉంటే ముత్యాలు ధరించడం మంచిది.

ముత్యాలు ధరించడం వల్ల మనస్సు ఏకాగ్రతకు గురవుతుంది. నెగిటివ్ థింకింగ్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే ముత్యాలు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి ముత్యాలు ధరించకూడదు. ముత్యాలు ప్రజలందరికీ మంగళప్రదం కాదు. ఒకవేళ ముత్యాలను ధరించాలనుకుంటే జ్యోతీష నిపుణలను కన్సల్ట్ చేయడం మంచిద...