భారతదేశం, ఆగస్టు 22 -- మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు ఊహించని స్పందన లభించింది! ఫలితంగా, ఈ భారీ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని, తొలుత 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాలనుకున్న ఈ ఎలక్ట్రిక్​ కారు ఉత్పత్తిని ఇప్పుడు 999 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించాల్సి వచ్చింది.

కస్టమర్లు తమకు నచ్చిన బ్యాడ్జ్ నంబర్‌ను (001-999) ఎంచుకోవచ్చు. ప్రీ-బుకింగ్‌లు ఆగస్ట్​ 21 సాయంత్రం 5 గంటల నుంచి 'యాడ్ యువర్ ప్రిఫరెన్స్' అనే ఫీచర్‌తో ప్రారంభమయ్యాయి. దీనివల్ల బుకింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది. అధికారిక బుకింగ్‌లు ఆగస్ట్​ 23 ఉదయం 11 గంటలకు మొదలవుతాయి. రూ. 21,000 టోకెన్​ అమౌంట్​తో మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ కారు బుక్​ చేసుకోవచ్చు.

కారు లోపలి భాగం పూర్తిగా అలంకరించారు! ఇందులో స్వెడ్, లెదర్ వాడారు. గోల్డ్ సెపియా యాక్సెంట్ స్టిచింగ్, అలాగే బ్యాట్ చిహ...