భారతదేశం, జూన్ 6 -- ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ఎండల్లో అయినా, చలికాలంలో అయినా సీజన్‌తో పని లేకుండా ఐస్‌క్రీమ్స్‌ని తింటూ ఉంటారు. ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ మన వ్యక్తిత్వాన్ని ఎలా చెబుతుంది? మన ప్రవర్తన, వ్యక్తిత్వం ఇష్టమైన ఐస్‌క్రీమ్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఏంటి? మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ మీ గురించి ఏం చెబుతుందో ఇప్పుడు చూడండి.

రాశుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా, పుట్టిన నెల ఆధారంగా, పేరులో మొదటి అక్షరం ఆధారంగా, చేతిరాత ఆధారంగా ఎలా అయితే వ్యక్తిత్వం, తీరు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి చెప్పచ్చో, ఇష్టమైన ఐస్‌క్రీమ్ ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పచ్చు. ఐస్‌క్రీమ్ కేవలం రుచి కాదు, మనస్తత్వానికి కూడా అద్దం పడుతుంది అని మానసిక నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీమ్ రుచులకు, మనుషుల మనస్తత్వానికి లింక్ ఉందన...