భారతదేశం, ఏప్రిల్ 29 -- వైదిక జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో గురు గ్రహానికి విశిష్ట స్థానం ఉంది. ఆయనను 'దేవగురువు' అని పిలుస్తారు. ఒక వ్యక్తి జాతకంలో గురు గ్రహం అనుకూలంగా ఉంటే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతాన సుఖం, ఉన్నత విద్య దక్కుతాయి. అయితే, అదే గురువు బలహీన స్థితిలో ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. అసలు మీ జాతకంలో గురు బలం తగ్గిందని ఎలా గుర్తించాలి? ఆ దోషం పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

జాతకంలో బృహస్పతి అనుకూలత లేనప్పుడు వ్యక్తి నిర్ణయ సామర్థ్యం తగ్గిపోతుంది. జ్ఞానం ఉన్నా దానిని సరైన సమయంలో ఉపయోగించలేరు.

గురు దోషం నుంచి విముక్తి పొందేందుకు పెద్దలు, జ్యోతిష్య నిపుణులు కొన్ని సహజమైన మార్గాలను సూచిస్తున్నారు. ఇవి పాటించడం వల్ల మీ వ్యక్తిత్వంతో పాటు జాతక బలం కూడా మెరుగుపడుతుంది.

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై చందనం లేద...