భారతదేశం, ఆగస్టు 25 -- ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు తమ వాహనాల పనితీరు, ఇంధన సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని చాలామంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. ఆటోమొబైల్​ పరిశ్రమ నిపుణుల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ల టైప్​​ బట్టి, E20 వినియోగంతో మైలేజ్​ 2-5శాతం పడిపోతుందని చెబుతున్నారు. అయితే, అంత ప్రభావం ఉండదని ప్రభుత్వం అంటోంది.

ఆటోమోటివ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. E20 ఇంధనం వాడటం వల్ల వాహనాల మైలేజ్ 2 నుంచి 5 శాతం వరకు తగ్గుతుంది. ఇది వాహనం రకాన్ని బట్టి మారుతుందని వారు చెబుతున్నారు. ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి (కెలొరిఫిక్ వాల్యూ) ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఒక నిపుణు...