Hyderabad, ఆగస్టు 26 -- బాలీవుడ్ నటి ఆలియా భట్ ముంబైలోని తన నిర్మాణంలో ఉన్న ఇంటి వీడియోలను పోస్ట్ చేస్తున్న పబ్లికేషన్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లపై ఫైర్ అయింది. ఆ వీడియోలను వెంటనే తొలగించాలని, తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరింది. మంగళవారం (ఆగస్టు 26) తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆలియా భట్ తన మెసేజ్‌ను ఇలా మొదలుపెట్టింది. "ముంబై లాంటి సిటీలో స్థలం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. కొన్నిసార్లు మన విండో నుంచి చూస్తే ఎదుటి వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. కానీ దానివల్ల ఎవరికీ ప్రైవేట్ ఇళ్ళని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టే హక్కు ఉండదు.

ఇంకా కడుతున్న మా ఇంటి వీడియోను చాలా పబ్లికేషన్స్ మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి షేర్ చేశాయి. ఇది మా ప్రైవసీని ఉల్లంఘించడమే కాకుండా ఒక సీరియస్ సెక్యూరిటీ సమస్య కూడా" అని ఆమె స్ప...