భారతదేశం, నవంబర్ 16 -- హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న వారణాసి ఈవెంట్ ఒక గొప్ప వేడుకగా జరిగింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం 'వారణాసి' ఫస్ట్ లుక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నటులు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి ఆవిష్కరించారు. అయితే, ఈవెంట్ సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. ట్రైలర్ భారీ తెరపై ప్లే అవ్వడానికి ముందు కొన్నిసార్లు ఆగిపోయింది.

ఈ ఈవెంట్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చలిలోనూ నిలబడ్డారు. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ఓపికగా వేచి ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వారణాసి మూవీ ట్రైలర్ ప్రదర్శించడంలో ఇబ్బందులు తలెత్తినా మహేష్ ఫ్యాన్స్ ఓపికగా వెయిట్ చేశారు.

"వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించి, చలిలో దాదాపు 3 కిలో...