Hyderabad, ఆగస్టు 1 -- రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో తెలుసుకున్నట్లే, పుట్టిన నెల ఆధారంగా కూడా మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెప్పొచ్చు. ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారు ఎలా సక్సెస్‌ను అందుకుంటారు? ఆగస్టు నెలలో పుట్టిన వారి బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరికి పుట్టిన సమయం భిన్నంగా ఉంటుంది. పుట్టిన రోజు, పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఆగస్టు నెలలో పుట్టిన వారి గురించి చూసేద్దాం.

ఏదైనా సంవత్సరంలో ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వీరు నిజాయితీగా ఉంటారు. డబ్బు మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, కళాకారులుగా పనిచేస్తూ ఉంటారు.

ఈ నెలలో పుట్టిన వారు పొగడ్తలు ఎక్కువ ఇ...