భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలుసు కదా. సంక్రాంతి సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 20) సాయంత్రం చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు.
చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగు, ఇంగ్లిష్ లలో ఓ పోస్ట్ చేశాడు. "మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే - నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు" అని చిరు అన్నాడు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.