భారతదేశం, ఆగస్టు 13 -- కరోనా టైమ్ లో ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే మూవీస్, సిరీస్ లు చూసే అవకాశం ఉండటంతో అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ కు అలవాటు పడ్డారు. ఆ టైమ్ లో మలయాళం, తమిళం, తెలుగు అనే భాష భేధం లేకుండా అన్ని సినిమాలూ చూసేశారు. ఇలా చూసిన వాళ్లలో చాలా మంది మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ఉన్న ఈ మలయాళం థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి. ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్లు ఇవి.

కేవలం మలయాళం అనే కాదు ఇండియాలోనే థ్రిల్లర్ మూవీ అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చే సినిమాల్లో కచ్చితంగా 'దృశ్యం' పేరు ఉంటుంది. మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా అంతలా పాపులర్ అయింది. కన్న కూతురిని బ్లాక్ మెయిల్ చేసే పోలీస్ అధికారిని తండ్రి హతమార్చడం, ఆ తర్వాత కుటుంబాన్ని కేసు నుంచి రక్షించడం అనే కాన్సెప్ట్ తో మూవీ అదిరిపోయింది...