భారతదేశం, ఆగస్టు 18 -- ఇండియాలో వర్క్​ ఫ్రం హోం చేస్తున్న వారికి బంపర్​ న్యూస్​! మీరు దుబాయ్​కి వెళ్లి, అక్కడి నుంచి ఏడాది పాటు మీ రిమోట్​ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ మేరకు దుబాయ్​ డిజిటల్​ నోమాడ్​​ వీసాను ప్రవేశపెట్టారు. ఈ వర్చువల్​ వీసా ఫీజు చాలా అంటే చాలా తక్కువ!

దుబాయ్ వర్చువల్ వర్కింగ్ ప్రోగ్రామ్ అని కూడా పిలిచే ఈ డిజిటల్ నోమాడ్ వీసా.. యూఏఈ వెలుపల ఉన్న కంపెనీ కోసం పనిచేసే రిమోట్ ఉద్యోగులకు దుబాయ్‌లో ఒక సంవత్సరం పాటు నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఇస్తుంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్పాన్సర్ అవసరం లేదు. అయితే కొన్ని అర్హత ప్రమాణాలను కచ్చితంగా కలిగి ఉండాలి.

దుబాయ్ డిజిటల్ వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి:

మీరు యూఏఈ వెలుపల రిజిస్టర్ అయిన కంపెనీకి ఉద్యోగిగా ఉండాలి లేదా విదేశాల్లో రిజి...