భారతదేశం, సెప్టెంబర్ 24 -- తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇటీవల రవితేజ, రామ్ గోపాల్ వర్మ నుండి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. నటీనటుల అంకితభావం, కృషిని అభినందించారు. అల్లు అర్జున్ మిరాయ్‌ను ప్రశంసించారు.

అల్లు అర్జున్ ఎక్స్ లో ఒక నోట్ షేర్ చేశారు. మిరాయ్‌లోని నటనలను ప్రశంసిస్తూ, ఈ చిత్రాన్ని"టెక్నికల్ బ్రిలియన్స్ (సాంకేతిక నైపుణ్యం)" అని పొగిడేశారు. "మిరాయ్ బృందానికి అభినందనలు! అభిరుచి, నమ్మకంతో అద్భుతంగా రూపొందిన మూవీ ఇది. సోదరుడు తేజ సజ్జా పట్ల గౌరవం కలుగుతోంది. ఇలాంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా క్రెడిట్ దక్కాల్సిందే. మై బ్రదర్ మనోజ్ నువ్వు చంపేశావ్! రితికా స్వీట్ ప్రజెన్...