భారతదేశం, మే 26 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలన్నింటికీ రాజుగా భావించే సూర్యుడు.. మనిషి ఆత్మకు, గౌరవ మర్యాదలకు, ప్రభుత్వ రంగానికి కారకుడు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటారు. ఈ మార్పునే మనం 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. జ్యోతిష్య గణాంకాల ప్రకారం, సూర్యుడు 2026 జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నారు.

బుధుడు అధిపతిగా ఉండే మిథున రాశిలోకి సూర్యుడు రావడం వల్ల ద్వాదశ రాశులపై దీని ప్రభావం ఉంటుంది. అయితే, మూడు రాశుల వారికి మాత్రం ఈ గోచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక అంశాల్లో వీరు ఊహించని ప్రగతిని సాధిస్తారు.

సూర్య సంచారం మేష రాశి జాతకుల తలరాతన...