Hyderabad, జూలై 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు

పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాకు ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా బాబీ డియోల్ విలన్‌గా చేశారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరో మూడు రోజుల్లో హరి హర వీరమల్లు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌‌లో భాగంగా మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు ...