భారతదేశం, మార్చి 6 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికీ కారకుడు. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. దీనితో మాలవ్య రాజయోగం కూడా ఏర్పడింది. మార్చి 2న ఏర్పడిన ఈ మాలవ్య రాజయోగం మార్చి 26 వరకు ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనదని చెప్పొచ్చు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విలాసాలు అందుతాయి.

కెరియర్, వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. శుక్రుడు మీనరాశిలో శనితో సంయోగం చెందడంతో ఈ రాజయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. మీనరాశిలో శుక్రుడు ఉండడంత...