Hyderabad, ఆగస్టు 25 -- మలయాళం నుంచి వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మార్కో. ఈ సినిమా నిర్మాతల నుంచి మరో క్రేజీ మూవీ రానుంది. ఆ సినిమానే కట్టలన్. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మార్కో తర్వాత వస్తున్న సినిమా ఇది.

భారీ ప్రాజెక్ట్‌గా కట్టలన్ సినిమాను ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌‌గా రూపొందనున్న కట్టలన్ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాగే, లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని స్టోరీ లైన్‌ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. ఈ ఈవెంట్‌లోని నటీనటులకు ఆ ప...