భారతదేశం, జూలై 10 -- భారీ రోడ్ ప్రెజెన్స్ ఉన్న ఎస్‌యూవీలను ఇష్టపడేవారికి టాటా హారియర్, సఫారీలు ఎప్పుడూ హాట్ ఫేవరెట్లే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అయినా, విజయవాడ-వైజాగ్ జాతీయ రహదారి అయినా.. ఈ కార్లు వెళుతుంటే ఆ లుక్కే వేరు! ఇప్పుడు రోడ్డుపై వీటి గంభీరమైన రూపాన్ని మరింత పెంచేలా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఒక సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. తన పాపులర్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీల్లో సరికొత్త 'స్టెల్త్ ఎడిషన్'ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది.

గతంలో వచ్చిన స్టెల్త్ ఎడిషన్లు కేవలం పరిమిత సంఖ్యలోనే విక్రయించగా, ఈసారి మాత్రం వీటిని 2026 శ్రేణిలో శాశ్వత మోడళ్లుగా కంపెనీ చేర్చింది. మార్కెట్లో హారియర్ స్టీల్త్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ.23.43 లక్షలుగా నిర్ణయించగా, ప్రీమియం 7-సీటర్ సఫారీ స్టీల్త్ ఎడిషన్ ధర రూ.24.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్...