భారతదేశం, డిసెంబర్ 26 -- వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ పండుగ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్, సన్నిహితులతో కలిసి అతడు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజమౌళితో కలిసి వారణాసి మూవీలో బిజీగా ఉన్నా కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. తన కుటుంబం, స్నేహితులతో కలిసి అతడు ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 25) నాడు నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.

మహేష్ బాబు ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఎరుపు రంగు టీ-షర్ట్, జీన్స్‌లో కనిపించగా.. నమ్రత నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. కూతురు సితార ఎరుపు రంగు డ్రెస్సులో క్యూట్‌గా ...